ఈ వృద్ధురాలు తన సొంతూరు వెళ్లేందుకు బస్సు దిగి ఆటో కోసం నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. ఆమెను గమనించిన ఓ యువకుడు చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అసలేం జరిగిందంటే?
సమాజంలోని కొందరు వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులకు హాని చేయడంతో పాటు వారి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ గుర్తు తెలియని యువకుడు.. పట్టపగలు అందరూ చూస్తుండగా దారుణానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా చేయాల్సింది అంతా చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఏం జరుగుతుందో తెలియక ఆ వృద్ధురాలు షాక్ గురైంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు ఇటీవల బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి తన సొంతూరుకు వెళ్లేందుకు శంకర్ పల్లిలో బస్సు దిగింది. ఇక అక్కడి నుంచి మెల్లగా ఆటో కోసం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. ఈమెను గమనించిన ఓ గుర్తు తెలియని యువకుడు సైలెంట్ గా ఆ వృద్ధురాలి వెంటే నడిచాడు. మెల్లగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఆ ముసలవ్వకు అస్సలు అర్థం కాలేదు. ఇక ఆమె వెనకకు తిరిగి చూసే సరికి అతడు అక్కడి నుంచి కనిపించకుండాపోయాడు. ఇక చేసేదేం లేక ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.