ఆమెకు ప్రియుడు అంటే చాలా ఇష్టం. భర్తతో ఉన్నట్లు నటిస్తూనే ప్రియుడితో గడిపేది. ఇదే విషయం ఇటీవల భర్తకు తెలిసింది. ఇక భర్తకు తెలియడంతో భార్య దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరి పేర్లు నర్సింహులు, యాదమ్మ. వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం వరకు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా కాపురాన్ని సాగించారు. ఇక రాను రాను యాదమ్మ తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టి ఏరి కోరి ఓ వ్యక్తిని ప్రియుడిని చేసుకుంది. భర్త కళ్లు గప్పి గత కొంత కాలంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక అసలు విషయం భర్తకు తెలియడంతో భార్య దారుణానికి ఒడిగట్టింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల పరిధిలోని దాదిగూడ రాంనగర్ కాలనీ. ఇక్కడే నర్సింహులు (32), యాదమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. పెళ్లైన కొన్నేళ్ల పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. భర్త కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఇదిలా ఉంటే, యాదమ్మ రాను రాను తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించినట్లు తెలుస్తుంది. అలా యాదమ్మ.. భర్త కళ్లు గప్పి అప్పుడప్పుడు ప్రియుడితో గడిపేది.
ఇదే విషయం భర్త నర్సింహులుకు తెలిసింది. దీంతో ఈ అంశంపై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరిగేవి. ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని యాదమ్మ భావించింది. దీంతో ఏం చేయాలో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడు ఆమెకు ఓ ఐడియా తట్టింది. అదే భర్తను ప్రాణాలతో లేకుండా చేయడం. ఇక అనుకున్నట్లే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి సమయం కోసం ఎదురు చూసింది. ఆ సమయం కూడా రానే వచ్చింది. ఈ నెల 27వ తేది రాత్రి భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. ఆ తర్వాత భర్త నిద్రపోయాడు. నిద్రపోకుండా ఉన్న యాదమ్మ.. భర్తను చంపాలని స్కెచ్ వేసింది.
అందుకు తాను ముందుగానే తెచ్చిపెట్టుకున్న డీజిల్ ను జోరు నిద్రలో ఉన్న భర్తపై పోసింది. ఆ తర్వాత అతడిపై నిప్పు విసిరింది. దీంతో నర్సింహులు మంటల్లో కాలిపోతూ అరుపులు, కేకలు వేశాడు. ఇది విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. 60 శాతం కాలిన గాయాలతో ఉన్న నర్సింహులు స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన నర్సింహులు సోదరుడు వదిన యాదమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యాదమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడి కోసం భర్తను చంపాలని చూసిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.