సంగారెడ్డి జిల్లాలో కిరాతకమైన ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు సొంత పెదనాన్న తల, మొండం వేరు చూసి ఊరిగేంచాడు. అంతేకాకుండా ఈ దుశ్చర్యను సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత పెదనాన్న తల, మొండం వేరు చేశాడో యువకుడు. అంతేకాకుండా అతని తలను ఊరేగించి ఆ తర్వాత ఓ చోట విసిరేసి హల్ చల్ చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఆ యువకుడు పెదనాన్న తల, మొండాన్ని ఎందుకు వేరు చేశాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
అది సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలం బర్దిపూర్ గ్రామం. ఇక్కడే బండమీది రాకేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతని తండ్రికి, పెదనాన్న బండమీది చంద్రయ్య (60)కు గత కొంత కాలంగా భూ వివాదంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్నదమ్ముల మధ్య ఇటీవల మరోసారి గొడవ జరిగినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే రాకేష్ తన పెదనాన్న చంద్రయ్యపై కోపంతో ఊగిపోయాడు. ఎలాగైన పెదనాన్నను హత్య చేసి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. రాకేష్ తాజాగా చంద్రయ్యను పొలంలోనే అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా కత్తితో చంద్రయ్య తల, మొండాన్ని వేరు చేశాడు.
ఇక ఆ తర్వాత తలను తీసుకుని ఊరంతా తిరిగి ఊరేగించి తలను గ్రామంలోని ఓ చోట విసిరేశాడు. ఇది చూసిన గ్రామస్తులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. రాకేష్ ఇదంతా తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని ఏకంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భూ తగాదాల కారణంగా సొంత పెదనాన్న తలనరికి ఊరేగించిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.