పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అఖిల్. వయసు 28 ఏళ్లు. నగరంలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఓ యువతిని ప్రేమించాడు. కానీ, గత కొంత కాలం నుంచి ఆ యువతి అఖిల్ తో మాట్లాడడం మానేసింది. దీంతో తట్టుకోలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ రోజుల్లో కొందరు యువతి యువకులు సమస్యకు పరిష్కారం లేదన్నట్లుగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని ఇలా రకరకాల కారణాలు చూపి చివరికి ఆత్మహత్యలకు పాల్పడి కన్నవాళ్ల కడుపుకోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. ప్రియురాలు మాట్లాడడం లేదని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆర్మూరు గ్రామానికి చెందిన అఖిల్ (28) అనే యువకుడు నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే ఈ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా ఇతడిని ఇష్టపడింది. ఇలా వీరి ప్రేమాయణం కొంత కాలం పాటు నడిచింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఆ యువతి అఖిల్ తో ఫోన్ లో మాట్లాడడమే మానేసింది. దీంతో అనేక సార్లు ఆ యువకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ యువతి అతనితో మాట్లాడకుండా, అఖిల్ నెంబర్ బ్లాక్ చేసింది.
దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని ఆ యువకుడు ఈ నెల 17 గచ్చిబౌలీలోని ఓ లాడ్జ్ లోకి వెళ్లాడు. అనంతరం అతడు అందులోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అఖిల్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కొడుకు చనిపోయాడని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, దీని వెనకాల ఏదో జరిగిందని అఖిల్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రియురాలు ఫోన్ మాట్లాడడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఈ యువకుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.