వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే.. ఆదివారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు శవాలుగా కనిపించారు. అసలేం జరిగిందంటే?
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను చంపి ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయందోళనలకు గురవుతున్నారు. అసలేం జరిగిందంటే? సంగారెడ్డి జిల్లా నాదులాపూర్ గ్రామానికి చెందిన నారాయణ (55), మల్లమ్మ (55) దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఈ భార్యాభర్తలు నగరంలోని గచ్చిబౌలీలో నివాసం ఉంటున్నారు. ఇక్కడే పని చేసుకుంటూ అప్పుడప్పుడు తమ స్వగ్రామానికి వస్తూ పోతుండేవారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం టేక్మాల్ మండలం అచన్నపల్లి గ్రామంలో జరిగిన బంధువుల పెళ్లికి ఈ దంపతులు హాజరయ్యారు. ఇక పెళ్లి అనంతరం ఈ దంపతులు స్వగ్రామమైన నాదులాపూర్ కు వెళ్లారు. అయితే రోజు రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ,.. భర్త నారాయణ భార్య మల్లమ్మను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఇక భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త.. ఆ తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇక తెల్లారేసరికి ఈ దంపతులు ఇంట్లో శవాలుగా కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
వెంటనే జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరిగేవని, దీనికి కారణంగానే ఈ దారుణం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.