సొంత అత్తమామలనే ఓ అల్లుడు హత్య చేయాలని చూశాడు. అవును.. మీరు విన్నది నిజమే. కారణం తెలిసి అత్తమామలు షాక్ గురయ్యారు. అల్లుడు వారిని ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసా?
సాధారణంగా కొంతమంది ప్రతీ చిన్న విషయానికి కూడా కోప్పడి పగ పెంచుకుంటుంటారు. ఇక మరి కొందరైతే చిన్న పొరపాటును కూడా అవమానంగా భావిస్తూ చివరికి హత్యలకు కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వ్యక్తి సొంత అత్తమామలనే హత్య చేయాలని పథకం రచించాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే అత్తమామల హత్యకు గల కారణాన్ని తెలుసుకుని అంతా షాక్ గురయ్యారు. అల్లుడు అసలు వారిని ఎందుకు హత్య చేయాలనుకున్నాడో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో వివాహం జరిగింది. అయితే ఇటీవల ఆ వ్యక్తి తన అత్తింటికి వెళ్లాడు. అతడు రాగానే అత్తమామలు పలకరించలేదు. దీనిని ఆ వ్యక్తి కాస్త అవమానంగా భావించాడు. ఇదే కారణంతో రమేష్ అత్తమామలను కోపంతో ఊగిపోయాడు. అంతేకాకుండా వారిని హత్య చేయాలని కూడా అనుకున్నాడు. ఇందులో భాగంగా రమేష్ ఈ నెల 12న అత్తమామలు ఉంటున్న ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. కానీ, ఆ సమయంలో అత్తమామలకు బదులుగా ఆ తలుపులను తల్లీకూతుళ్లు తెరిచారు. దీంతో వెంటనే కరెంట్ షాక్ తో వాళ్లు విలవిలలాడుతూ అరిచారు.
వెంటనే గమనించిన స్థానికులు కరెంట్ ఆఫ్ చేసి వారిని రక్షించారు. దీంతో అనుమానం వచ్చిన రమేష్ అత్తమామలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో వారి ఇంటికి కరెంట్ షాక్ పెట్టింది ఎవరో కాదని, సొంత అల్లుడేనని తేలింది. పోలీసుల విచారణలో అల్లుడు చెప్పిన కారణం తెలిసి అత్తమామలు, స్థానికులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంటికి వెళ్లినప్పుడు అత్తమామలు పలకరించలేదని, అందుకే హత్య చేయాలనుకున్నానని రమేష్ తెలిపాడు. అనంతరం పోలీసులు నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పలకరించలేదని అత్తమామలను చంపాలని చూసిన అల్లుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.