కొందరు దుర్మార్గులు దారుణంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి కుటుంబాన్ని హత్య చేయాలని భావించి ఏకంగా వారి ఇంటికే కరెంట్ షాక్ పెట్టారు. అసలేం జరిగిందంటే?
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని చంపాలని అనుకున్నారు. అందుకోసం పక్కా ప్లాన్ తో ముందుకు కదిలారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేటలో రాములు-రామవ్వ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే రాములు రోజూ రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తుండేవాడు. కానీ, శనివారం రోజూ మాత్రం పొలానికి వెళ్లకుండా రాములు అలాగే పడుకున్నాడు.
ఇక తెల్లవారుజామున అతని భార్య రామవ్వ నిద్రలేచి ఇంటి తలుపులు తీయబోయింది. వెంటనే ఆమె కరెంట్ షాక్ తో కిందపడింది. ఆ మహిళ ఒక్కసారిగా అరుపులు వేసింది. చుట్టు పక్కల వాళ్లు వచ్చి చూడగా.. వారి ఇంటికి కొందరు గుర్తు తెలియని దుండగులు కరెంట్ షాక్ పెట్టారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. స్థానికులు ఆ కరెంట్ ను తొలగించి ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రాములు కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాధితుడు రాములు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాములు ఇంటికి కరెంట్ షాక్ పెట్టింది ఎవరు? ఎందుకు వారిని హత్య చేయాలనుకున్నారనేది దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.