సైదాబాద్ ఘటన చిన్నారి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు. ఇందులో భాగంగా గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.
ప్రభుత్వం బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు అందించారు. చిన్నారి కుటుంభికులు మాత్రం ఆ చెక్కు మాకు వద్దని, నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మాకు ప్రభుత్వం అందించిన రూ.20 లక్షలు చెక్కు అవసరం లేదని, మీడియా సమక్షంలో తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.