సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపించి చివరికి శవమై తేలాడు నిందితుడు రాజు. కానీ పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా ఎవరికైన కనిపిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇస్తే మీకు రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ఆశపడి చాలా మంది వెతికినట్లుగా సమాచారం.
అలా కొంతమందైతే రాజు మాకు కనిపించాడంటూ పోలీసులకు కాల్ చేశారట. అలా పోలీసులకు కాల్ చేసిన వారిలో ఏకంగా 5 వేల పైగా కాల్స్ వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కానీ అందులో దాదాపుగా అన్ని ఫేక్ కాల్స్ అని అధికారులు తెల్చారు. కొంత మంది అయితే ఏకంగా రాజు మాకు కనిపించాడు. మాకు రూ.10 లక్షలు ఇస్తారా అంటూ చాలా మంది తెలిపినట్లు పోలీసులు తెలియజేశారు.
ఇక మొత్తానికి నిందితుడు రాజు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకపక్క చనిపోయింది రాజుకాదని బాధిత కుటుంబ సభ్యులు వాదిస్తుంటే.. మా కొడుకుని పోలీసులే చంపేశారంటూ నిందితుడి తల్లి ఆరోపిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అధికారికంగా ప్రకటించంతో ఇన్ని రోజుల మిస్టరీ వీడింది.