Sai Priya: విశాఖ ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన సాయి ప్రియ కేసులో ట్విస్ట్ చోటు చేసుకున్న సంగతి తెలసిందే. ఆమె తన ప్రియుడితో నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయి ప్రియ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ ఘటన దిమ్మతిరిగే ట్విస్ట్‌తో ముగిసింది. మధ్యలో పోలీసులు, కోస్ట్‌గార్డ్ పోలీసుల శ్రమ.. కోట్ల రూపాయల డబ్బు వృధా అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి నిందితురాలు పక్కా ప్లాన్‌తో ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. పక్కాగా ప్లాన్ చేయటమే కాదు.. దాన్ని పక్కాగా అమలు పర్చింది.
ఇంతకీ ఈ మిస్సింగ్ డ్రామాలో మొదటి నుంచి జరిగిందేంటి?.. సాయి ప్రియ ప్లాన్‌ను ఎలా వర్కవుట్ చేసింది?.. ఆ విషయాలు మీ కోసం.. సాయి ప్రియ సొంతూరు వైజాగ్. ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఓ టైలరింగ్ షాపు ఉండేది. అందులో పనిచేసే నెల్లూరుకు చెందిన ఓ మహిళా టైలర్ కుమారుడు రవితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్లు ప్రేమించుకున్నాక ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ విషయాన్నే ఇంట్లో వాళ్లకు చెప్పారు.
సాయి ప్రియ ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. శ్రీనివాస్ అనే వ్యక్తితో సాయి ప్రియకు పెళ్లి చేసి పంపేశారు. భార్యభర్తలు ఇద్దరూ హైదరాబాద్లో కాపురం పెట్టారు. అయితే, పెళ్లయినా సాయి ప్రియ ప్రియుడు రవిని మర్చిపోలేకపోయింది. తరచూ ఫోన్‌లో రవితో మాట్లాడుతూ ఉండేది. కొద్దిరోజుల క్రితం కోచింగ్ పేరు చెప్పి వైజాగ్‌లోని పుట్టింటికి వచ్చేసింది. అప్పుడప్పుడు రవిని కలుస్తూ ఉండేది. ఇంకెంత కాలం ఇలా దొంగచాటుగా కలుసుకోవాలన్న ఆలోచన ఇద్దరికీ కలిగింది. భర్తకు దూరంగా వచ్చేస్తే హాయిగా ఉండొచ్చని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్లాన్ వేశారు.
జూన్ 25న శ్రీనివాస్, సాయి ప్రియల పెళ్లిరోజు. పెళ్లి రోజున బీచ్‌కు వెళదామని శ్రీనివాస్‌ను అడిగింది సాయి ప్రియ. శ్రీనివాస్ భార్య మాట కాదనలేకపోయాడు. సాయంత్రం ఇద్దరూ వైజగ్‌లోని ఆర్కే బీచ్‌కు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్లాన్‌లో భాగంగా అక్కడికి రవి కూడా వచ్చాడు. శ్రీనివాస్, సాయి ప్రియలు బీచ్ అంతా కలియతిరిగారు. సాయంత్రం 6.30నుంచి 7.00గంటల సమయంలో ఇద్దరూ బీచ్‌లోనే ఉన్నారు. అప్పుడు శ్రీనివాస్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఓ ఫొటో కూడా ఉంది. అతడు ఆ ఫొటో ఏంటా అని చూస్తూ ఫోన్‌లో లీనమై పోయాడు.
అదే అదనుగా భావించిన సాయి ప్రియ అతడి దగ్గరినుంచి తప్పించుకుంది. గుంపులో కలిసిపోయి ప్రియుడు రవిని చేరుకుంది. ఆ తర్వాత సాయి ప్రియ, రవి ఆటోలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నెల్లూరు వెళ్లే రైలు ఎక్కారు. అలా ప్రియుడితో కలిసి సాయి ప్రియ నెల్లూరుకు వెళ్లిపోయింది. శ్రీనివాస్ ఫిర్యాదుతో సాయి ప్రియను వెతికేందుకు ముప్ప తిప్పలు పడ్డ పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రేస్ చేశారు. ఆమె నెల్లూరులోని కావలిలో ఉన్నట్లు గుర్తించారు. పక్కా ప్లాన్‌తో సాయి ప్రియ తన ప్రియుడితో కలిసి నెల్లూరుకు పరారైనట్లు తేల్చారు.
అయితే, నెల్లూరులో ఉంటే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో బెంగళూరుకు వెళ్లిపోయారు. అక్కడ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బెంగుళూరులో ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయిప్రియ తాలిబొట్టుతో ఉన్న పెళ్లి ఫోటోలను తల్లిదండ్రులకు పంపింది. తాను క్షేమంగా ఉన్నానంటూ, తన కోసం వెతకద్దంటూ వాట్సాప్ మెసేజ్‌లు కూడా పంపింది. రవి తల్లిదండ్రులను కూడా ఏమీ చేయొద్దని కోరింది. ఇక, భర్త ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరి, సాయి ప్రియ పక్కాప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: RK బీచ్ యువతి మిస్సింగ్ కేసుపై స్పందించిన విశాఖ డిప్యూటీ మేయర్!