దేశంలో నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో అందరికి తెలుసు. బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద యెత్తున క్యూ కట్టడమే కాదూ..గంటలు గంటలు పడిగాపులు కాశారు. ఈ సమయంలో ఓ రకమైన కమిషన్ దందా కూడా నడిచింది. ఇప్పుడు నోట్ల రద్దు అవుతున్నాయంటూ సరికొత్త మోసానికి పాల్పడిందో ముఠా.
దేశంలో నోట్ల రద్దు ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. నోట్ల రద్దు కారణంగా ప్రతి సామాన్యుడు సఫర్ అయినవాడే. పాత నోట్లు మార్చి కొత్త నోట్లు పుట్టుకొచ్చాయి. ఈ నోట్లను మార్చుకోవడం కోసం బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద యెత్తున క్యూ కట్టడమే కాదూ..గంటలు గంటలు పడిగాపులు కాశారు. ఉద్యోగాలు, పనులకు సెలవులు పెట్టి మరీ క్యూలైన్లో నుంచున్నారు. ఈ సమయంలో ఓ రకమైన దందా కూడా నడిచింది. మధ్య వర్తులు మొదలయ్యారు. డబ్బులు మార్పిడి చేస్తూ.. దానికి కొంత కమిషన్ తీసుకున్నారు. ఈ సమయంలో మోసపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మరోసారి నోట్ల రద్దు అవుతున్నాయంటూ బడా మోసానికి తెరలేపింది ఓ గ్యాంగ్.
రూ. 2 వేల నోట్లు రద్దు అవుతున్నాయంటూ.. అమాయకులను మోసం చేసి సుమారు రూ. 2 కోట్లు కొల్గగొట్టిందో గ్యాంగ్. అయితే హైదరాబాద్ పోలీసులు ఎంట్రీతో వీరి గుట్టు రట్టయింది. ఎల్బీనగర్‌లో ఈ ఘటన జరగ్గా.. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మహబూబ్, నార్సింగ్‌కి చెందిన కొలంపల్లి శ్రీనివాస్, ఉప్పల్‌కి చెందిన బింగి వాసు, ఎల్బీనగర్‌కి చెందిన సింగం శెట్టి రాములును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 వేల నోట్లు రద్దు చేస్తున్నారని నమ్మించి.. నోట్లు మారిస్తే 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పి.. అనేక మందిని మోసం చేసిందీ ముఠా. పలువురు వ్యాపారుల వద్ద కూడా ఇలానే దండుకున్నారు. అయితే పోలీసుల రంగ ప్రవేశంతో వారంత కటకటాల పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోట్ల రద్దు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్.. కొన్నిరోజుల కిందట వ్యాపారి ప్రభాకర్ గౌడ్‌తో పరిచయం పెంచుకుంది. తాను హోటల్ బిజినెస్ చేస్తానని, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను త్వరలోనే రద్దు చేస్తుందని రోషన్ చెప్పుకొచ్చాడు. తమ వద్ద పెద్ద మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉన్నాయని, వాటిని రూ.500తో ఎక్స్ చేంజ్ చేస్తే రూ.20 శాతం కమీషన్ ఇస్తామని ప్రభాకర్‌ను నమ్మించాడు. కమిషన్ వస్తుందన్న ఆశతో రూ. కోటి 90 లక్షల విలువైన రూ.500 నోట్లు బంధువులు, స్నేహితుల నుండి సేకరించి.. సమాచారం అందించాడు. మెహబూబ్ చెప్పినట్లుగా డబ్బు తీసుకుని శనివారం ఉదయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు వచ్చాడు.
డబ్బును వారికి అందించాడు ప్రభాకర్. ఈ విషయాన్ని తమ వ్యాపారికి చెప్పి.. వాటిని మార్చాంటూ అక్కడి నుండి నిందితులు వెళ్లిపోయారు. కాసేపు మెట్రో స్టేషన్ వద్ద ఎదురు చూసిన ప్రభాకర్.. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ప్రభాకర్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే గ్యాంగ్‌లోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.కోటి 90 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. నోట్ల రద్దు పేరుతో ఇంకా ప్రజలు మోసపోవడంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.