పోలీసులు, అధికారులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా కూడా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యం కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
రోడ్డు ప్రమాదం.. రోజులో దేశవ్యాప్తంగా కొన్ని వందల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కొందరి నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు తీసుకురావడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తోంది. రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడం కాదు.. ఒక కుటుంబం రోడ్డున పడటం అని అందరికీ తెలిసు. కానీ, ఎంతో మంది ఆ నిర్లక్ష్య ధోరణిని వీడలేకపోతున్నారు. అతివేగం, మద్యం సేవించడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలా కారణం ఏదైనా.. ఏ తప్పు చేయని ఎంతోమంది విగతజీవులుగా మిగులుతున్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులు ఎన్ని అఫేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహించినా ఉపయోగం ఉండటం లేదు.
తాజాగా బాలాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నెం పుణ్యం తెలియని ఓ మహిళ తన ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ నుచిం కుమార్తెను తీసుకుని ఇంటికి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఒక ట్రాలీ వాహనం ఆమెను గుద్దేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు మొత్తం ఖాళీగా ఉన్నా కూడా.. ఆ డ్రైవర్ రోడ్డు పక్కకు వచ్చి ఆమెను ఢీకొట్టాడు. అయితే ఆ మహిళ వివరాలు, ప్రమాదానికి కారణం మాత్రం తెలియలేదు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విజువల్స్ చూసిన వాళ్లు.. రోడ్డంతా వదిలేసి ఆమెను ఎందుకు ఢీకొట్టాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
బాలాపూర్‌లో దారుణం.. రోడ్డు మీద వెళుతున్న మహిళను ఢీకొట్టిన ట్రాలీ ఆటో.. మహిళ మృతి. pic.twitter.com/0Lo8Yz6N6g
— Telugu Scribe (@TeluguScribe) March 27, 2023