అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవర కొండ మీద ఉన్న గుడికి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఘాటు రోడ్డులో కారు అదుపు తప్పింది. ఇది ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుక్కరాయ సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవర కొండ మీద ఉన్న గుడికి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఘాటు రోడ్డులో కారు అదుపు తప్పింది. కొండ మీద నుండి కారు కిందకు పడిపోవడంతో నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు . మృతుడు అనంతపురంలోని విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ ఉమాపతిగా గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్య లేదా ప్రమాదమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రమాదానికి చెందిన వీడియో ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దేవర కొండ మీద ఉన్న వెంకటేశ్వరుని దేవాలయానికి ఉమాపతితో పాటు డ్రైవర్ కూడా వెళ్లాడని, దర్శనం అనంతరం డ్రైవర్‌ను కిందకు దించేసి, ఆయన కారును నడిపాడని పోలీసులు చెబుతున్నారు. అంతలోనే కారు అదుపు తప్పి కొండ కిందకు పడిపోయిందని వెల్లడించారు. ఉమాపతి ఈ ఘటనలో చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనపై పలు అనుమానాలున్నాయన్నారు. అతడికి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేశారని చెప్పారు. ఈ కేసు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.