వివాహిత సాయిప్రియ.. గత మూడ్రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ సంచలనంగా మారింది. విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతు అయ్యిందని అంతా భావించి గాలింపు చర్యలు చేస్తుండగా.. 36 గంటల తర్వాత నెల్లూరులో ప్రియుడితో కలిసి ప్రత్యక్షం అయ్యి అందరికీ షాకిచ్చింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ కు ప్రభుత్వం దాదాపు రూ.కోటి ఖర్చు చేసింది. ఆ తర్వాత తాను రవి అనే అబ్బాయిని ప్రేమించినట్లు.. తనని పెళ్లి కూడా చేసుకున్నానంటూ ఓ ఆడియో మెసేజ్ ను పంపింది.
ఇలా ఆమె గల్లంతు అయ్యిందని భావించిన క్షణం నుంచి ఆమె పెళ్లి చేసుకున్నాను అని చెప్పే వరకు అన్నీ ట్విస్టులు, షాకులే ఉన్నాయి. శ్రీనివాస్ తో వివాహం జరిగిన తర్వాత రెండేళ్లకు సాయి ప్రియ ఇలా ప్రియుడితో వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంది. తనని రవి బలవంతం చేయలేదని.. తానే ఇష్టపూర్వకంగా వెళ్లిపోయానంటూ చెప్పుకొచ్చింది. తమ కోసం వెతకొద్దని.. అలా బలవంతంగా తీసుకొచ్చినా ఇద్దరూ ప్రాణాలతో ఉండం అంటూ హెచ్చరించింది.
అయితే రవి వాళ్ల తండ్రి సుమన్ టీవీతో మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. రవి తండ్రి అప్పలరాజు అతని భార్య హసీనా ఇద్దరూ విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. వారికి ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. వారిలో రవి పెద్దవాడు. మొదట సాయి ప్రియ గల్లంతు వార్త తెలియగానే రవి వాళ్ల తండ్రి కూడా అందరితోపాటు వెతకడానికి వెళ్లినట్లు చెప్పారు.
ఆ తర్వాత వాళ్ల అబ్బాయితోనే వెళ్లిపోయిందని.. నెల్లూరులో ఉన్నారని చెప్పడంతో కుమారుడి కోసం స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రవి వాళ్ల అమ్మతోపాటే కలిసి జీవించేవాడు. ఆమె టైలరింగ్ చేస్తూ ఉండేది. ఐటీఐ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చెస్తున్నట్లు తెలిపారు. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లుగానీ, ఇలా చేస్తారని గానీ తనకి తెలియదంటూ అప్పలరాజు చెప్తున్నారు. తన పిల్లలు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి వెళ్తారు తప్ప.. తన దగ్గర ఉండరంటూ తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.