మొన్నటి దాకా సెల్ఫీ పిచ్చి.. ఇప్పుడు రీల్స్, టిక్ టాక్ వీడియో, షార్ట్స్ ఇలాంటివి స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లోకల్ గా సెలెబ్రిటీలుగా కావాలన్న ఆశతో కొంతమంది ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతు ప్రాణాలు తీసుకుంటున్నారు. కారణాలు ఏమైనా కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. దేవుడు ఇచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. రీల్స్, టిక్ టాక్ వీడియో, షార్ట్స్ తో చాలా మంది పాపులర్ కావాలని చూస్తున్నారు. చిన్నా పేద్దా అనే తేడా లేకుండా తమ టాలెంట్ చూపిస్తున్నారు. కొంతమంది ఈ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేయొద్దు అన్నందుకు 9 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తిరువళ్ళూర్ జిల్లాకు చెందిన కృష్ణమూర్తి కుమార్తె ప్రతీష.. వయసు 9 ఏళ్లు. కొంత కాలంగా పాటలకు రీల్స్ చేస్తూ ఇన్స్ స్ట్రాలో అప్ లోడ్ చేస్తుంది. ఎప్పుడూ చలాకీగా ఉండే ప్రతీష ఇప్పటికే ఇన్స్ స్ట్రాలో 50 పైగా రీల్ చేసింది. మంగళవారం రాత్రి ఓ పాటకు రీల్స్ చేస్తున్న సమయంలో ప్రతీషా తండ్రి కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పరీక్షల సమయం అని.. చదువు పై శ్రద్ద చూపించాలని.. ఎగ్జామ్స్ అయ్యాక రీల్స్ చేసుకోవచ్చు అని మందలించాడు. దాంతో మనస్థాపానికి గురైన ప్రతీషా ఎవరూ లని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానాకి పాల్పపడింది.
ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి ఒక్కసారే షాక్ తిన్నాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ప్రతీష ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించడంతో నిర్ఘాంతపోయాడు. ప్రతీషాను కిందకు దింపి వెంటనే ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ప్రతీష కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పాప హఠాత్తుగా కన్నుమూయడం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరయ్యారు. ప్రతీష మరణంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. అందరితో సందడిగా ఉంటూ.. తన ఆటపాటలతో అల్లరి చేసే ప్రతీషా ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచి వేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.