Crime News: 2022 ఏప్రిల్ 16, శనివారం
బిజినెస్ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లిన భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఇంటినుంచి వెళ్లి కేవలం ఒక రోజు మాత్రమే అయింది. కానీ, భార్గవికి మాత్రం యుగాలుగా అనిపిస్తోంది. విపరీతమైన భయంగా కూడా ఉంది. రాత్రి లోగా ఇంటికి రావాల్సిన భర్త రాలేదు.. ఎంత పనిలో ఉన్నా ఫోన్ చేసి విషయం చెప్పే వాడు ఫోన్ చేయలేదు. వాటికి తోడు కొన్ని గంటల నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త కనిపించకుండా పోయాడని కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు లకుడారం గ్రామ శివారులో ఓ శవాన్ని పూడ్చి పెట్టారని పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయం పోలీసులు అక్కడకు వెళ్లారు. కాల్వలో రామకృష్ణ మృతదేహం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో భార్గవి కుటుంబసభ్యులే రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేయించారని రామకృష్ణ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కోణంలో విచారణ చేశారు. పరువు హత్య వెలుగులోకి వచ్చింది.
రామకృష్ణ, భార్గవిల ప్రేమ.. కులాంతర వివాహం..
వలికొండ మండలంలోని లింగరాజుపల్లికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్ కుమారుడు ఎరుకల రామకృష్ణ 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అక్కడ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో అతడికి పరిచయం ఏర్పడింది. తరచూ వెంకటేశం ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే వెంకటేశం కుమార్తె భార్గవితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం తెలిసిన వెంకటేశం, రామకృష్ణను దూరం పెట్టాడు. ఈ నేపథ్యంలోనే 2019లో తుర్కపల్లి గుప్త నిధుల కేసులో రామకృష్ణ సస్పెండ్ అయ్యాడు. ఇక అప్పటినుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. 2020 ఆగస్టు 16న వెంకటేశం ఇష్టానికి వ్యతిరేకంగా భార్గవి, రామకృష్ణలు పెళ్లి చేసుకున్నారు. తన కూతుర్ని వదిలిపెట్టాలంటూ వెంకటేశం ఓ రెండు సార్లు రామకృష్ణను బెదిరించాడు. అయినా రామకృష్ణ తగ్గలేదు. భార్గవి గర్భిణి కావటంతో భువనగిరి తాతానగర్‌లో అద్దె ఇంట్లోకి మారారు. ఆరు నెలల క్రితం వారికి ఓ పాప పుట్టింది.
ఐదు నెలల క్రితమే ప్లాన్.. రంగంలోకి సుఫారీ గ్యాంగ్..
తన కూతుర్ని తనకు కాకుండా చేశాడన్న కోపంతో వెంకటేశం అల్లుడిపై పగ పెంచుకున్నాడు. అల్లుడ్ని ఎలాగైనా చంపించాలనుకున్నాడు. ఐదు నెలల క్రితం సిద్ధిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 6 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను రామకృష్ణకు పరిచయం చేయించాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలని రామకృష్ణను వెంట తీసుకెళ్లారు. వాళ్లు అతడ్ని గుండాల మండంల రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మంది వారితో చేరారు. అందరూ కలిసి రామకృష్ణను తాళ్లతో కట్టేశారు. రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్ వాహనంలో లతీఫ్ ఇంటికి తీసుకెళ్లారు. తెల్లవారుజామున కొండపాక మండలం లకుడారం గ్రామంలోని నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు. ఈ పరువు హత్యపై జనం తీవ్రంగా స్పందిస్తున్నారు. శాస్త్ర సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ పరువు కోసం హత్య చేయటం ఏంటి అంటూ మండిపడుతున్నారు. మరి, ఈ పరువు హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మరిదితో సంబంధం.. బయటపడకుండా సొంత చెల్లినే!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.