Rangareddy: సమాజం ఎంత ఆర్థిక ప్రగతి సాధిస్తున్నా.. టెక్నాలజీ పరంగా ఎంత వృద్ధి చెందుతున్నా ఇంకా బాల్య వివాహాలు ఆగటం లేదు. కూతుళ్లను గుండెలపై కుంపటిలా భావిస్తున్న కొందరు తల్లిదండ్రులు చిన్న వయసులోనే వారికి పెళ్లిళ్లు చేస్తున్నారు. వయసులో ఆడపిల్లలకంటే చాలా పెద్దవారైన మగాళ్లతో పెళ్లి చేస్తున్నారు. తాజాగా, రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలని చెప్పి బాలికకు పెళ్లి చేశారు కుటుంబసభ్యులు. వయసులో 23ఏళ్లు పెద్ద వాడైన వ్యక్తితో పెళ్లి జరిపించారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ జంటకు 12 ఏళ్ల బాలిక ఉంది. బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో సంబంధం కుదిర్చారు. బాల్య వివాహం కావటంతో ఎవరికీ తెలియకుండా చెయ్యాలనుకున్నారు. బాలికకు సైతం అది పెళ్లి అని తెలియనీయకుండా ఓ పెద్ద ప్లాన్ వేశారు. పుట్టినరోజు వేడుకలని చెప్పి పెళ్లి జరిపించేశారు.
తనకు పెళ్లి జరిగిందని గ్రహించిన బాలిక తల్లిదండ్రులనుంచి పారిపోయి బంధువుల ఇంటికి చేరింది. తల్లిదండ్రులు సదరు బంధువులతో గొడవ పెట్టుకున్నారు. బాలిక తనకు జరుగుతున్న అన్యాయాన్ని తలుచుకుని ఏడ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఐసీడీఎస్ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు గ్రామానికి చేరుకున్నారు. బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామస్తులు, ఐసీడీఎస్ అధికారులకు ముందు చెప్పింది. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఎక్కడ ఉంచాలనే దానిపై అధికారులు మేథోమథనం చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Guntur: భార్య వివాహేతర సంబంధం.. భర్త సెల్ఫీ సూసైడ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.