తండ్రి వేధింపులు భరించలేక ఓ అమాయకపు కూతురు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గోనిగూడ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన నర్సింహ, లలిత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు, ఓ కూతురు సంతానం. ఇక గత కొన్ని రోజులు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే గతేడాది నర్సింహులు భార్య లలిత మరణించడం విశేషం.
భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త నర్సింహులు అతిగా తాగుడుకు బానిసయ్యాడు. ఇక రోజు ఇంటికి తాగి వస్తూ ఉండేవాడు. అలా వచ్చిన క్రమంలో తన కూతురిని కొట్టడం, తిట్టడం వంటి వేధింపులకు గురి చేసేవాడు. దీంతో తండ్రి వేధింపులను భరించలేని కూతురు గతంలోనే అనేక సార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇక ఇటీవల కాలంలో తండ్రి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
ఇది కూడా చదవండి: భార్య శవం పక్కన భర్త.. గదిలో ఇద్దరు అమ్మాయిలు..
కాగా ఆదివారం ఇంట్లో హై హేట్ మై డ్యాడ్ అంటూ పుస్తకంలో నాలుగు సార్లు రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇంట్లోకి సడెన్ గా వచ్చిన తండ్రి కూతురి దూలానికి వేలాడుతూ కనిపించే సరికి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మరో విషయం ఏంటంటే? మా నాన్న మూర్ఖుడు.. తాగొచ్చి రోజూ నరకం చూపిస్తున్నాడు. మా అమ్మ బతికి ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు. ఆపై మద్యానికి బానిసై దుర్మార్గుడిలా తయారయ్యాడు. నాన్నా.. అని పిలవడానికే మనసు రావడం లేదు.
ఆయనను చంపాలని లేదా చనిపోవాలని ఉంది. మూడు సార్లు ఉరి వేసుకున్నా.. ఎవరో ఒకరు కాపాడారు. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికీ తెలుస్తోంది.. వెయిటింగ్ ఫర్ మై డెత్.. అంటూ కూతురు గతంలోనే ఓ ఉత్తరం రాసుకుంది. తాజాగా జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.