రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుర్మార్గపు భర్త కరెంట్ షాక్ తో భార్య ప్రాణాలు తీశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సర్వ సాధారణం. కూర్చుని మాట్లాడుకుంటే సమిసిపోయే గొడవలను కొందరు దంపతులు పెద్దవి చేసుకుంటున్నారు. అంతే కాకుండా గోటితో పోయేదాన్ని చివరికి గొడ్డలిదాక తెచ్చుకుని చివరికి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. దారుణానికి పాల్పడ్డాడు. క్షణికావేశంలో భార్యకు కరెంట్ షాక్ పెట్టి ప్రాణాలు తీశాడు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ లో యాదయ్య – కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు చిన్న చిన్న కారణాలతో తరుచు గొడవపడేవారు. ఈ క్రమంలోనే ఈ భార్యాభర్తలు ఇటీవల మరోసారి గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త యాదయ్య.. భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు. దీంతో భార్య కవిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం భర్త యాదయ్యపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడు యాదయ్యను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణికావేశంలో కరెంట్ షాక్ పెట్టి అన్యాయంగా భార్య ప్రాణాలు తీసిన ఈ కిరాతకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.