నేటి కాలంలో కొందరు యువకులు శారరీక కోరికలు తీర్చుకునేందుకు ఎంతటి దారుణానికైన తెగిస్తున్నారు. అవసరమైతే నమ్మించి గొంతు కొసి స్నేహం పేరుతో తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలా బరితెగించిన ఓ ఇద్దరు యువకులు బాలికపై అత్యాచార దాడికి దిగి చివరికి గర్భవతిని చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది.
ఈ క్రమంలోనే ఆ బాలికకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. ప్రేమిస్తున్నానని ఒకరు, స్నేహమంటూ మరొకరు ఆ బాలిక వెంటపడేవారు. కొన్నాళ్లపాటు ఈ ఇద్దరు యువకులు ఆ బాలికను నమ్మించి సన్నిహితంగా ఉన్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత మెల్ల మెల్లగా మాటలు మార్చి లోబరుచుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆ బాలిక వారి మాటలను పూర్తిగా నమ్మింది. వారి చెప్పినట్టే వినడంతో ఆ దుర్బార్గులు సమయం దొరికితే చాలు ఇంట్లోకి దూరి కోరికలు తీర్చుకునేవారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: నా మొగుడు కనిపించడం లేదంటూ భార్య కంప్లైంట్.. పోలీసుల విచారణలో ఖంగుతినే నిజాలు!
అలా కొన్నాళ్ల పాటు ఈ దుండగులు ఆ బాలికపై సమయం చూసి మరీ అత్యాచారం చేశారు. దీంతో ఇటీవల ఆ బాలిక కడుపు నొప్పి అని చెప్పడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఈ బాలిక గర్భవతి అంటూ నిర్ధారించారు. ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ బాలిక తల్లిదండ్రులు ఒకరి మోహాలు ఒకరు చూసుకున్నారు. కోపంతో ఊగిపోయి ఏం జరిగిందంటూ బాలికను తండ్రి ప్రశ్నించాడు. అసలు విషయం బాలిక బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ బాలిక తండ్రి స్థానిక పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.