హనుమంత్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి ఇద్దరూ తండ్రి కొడుకులు. ఇటీవల ఒక అంశంపై ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో తండ్రి కొడుకుని దారుణంగా హత్య చేశాడు. కారణం ఏంటంటే?
తండ్రిని కొట్టి చంపిన కొడుకు, కొడుకును కొట్టి చంపిన తండ్రి.. ఇలాంటి దారుణ ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు.. ఇలా కారణం ఏదైనా చివరికి క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. అయితే సరిగ్గా.. ఇలాంటి ఘటనలోనే ఓ తండ్రి.. కన్న కొడుకుని విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామం. ఇక్కడే తొండుపల్లి హనుమంత్ రెడ్డి (37) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను షాద్ నగర్ పట్టణంలో ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు. అయితే శనివారం కొడుకు హనుమంత్ రెడ్డి, తండ్రి గోవర్దన్ రెడ్డిల మధ్య ఓ చిన్న వివాదం జరిగింది. దీంతో తండ్రి కొడుకుతో గొడవ పడ్డాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన కొడుకు హనుమంత్ రెడ్డి.. తండ్రిని అసభ్య పదజాలంతో తిట్టినట్లు సమాచారం.
ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన తండ్రి గోవర్దన్ రెడ్డి.. ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కొడుకు తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో కొడుకు రక్తపు మడుగులో కింద పడిపోయాడు. వెంటనే గమనించిన అతని కటుంబ సభ్యులు, స్థానికులు హనుమంత్ రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అతడు అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలుసుకున్న హనుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
తండ్రి దాడిలో కొడుకు మరణించడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనంతరం పోలీసులు నిందితుడు అయిన తండ్రి గోవర్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణకావేశంలో కొడుకును హత్య చేసిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.