రంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మూడు నెలల పాప ఉండడం విశేషం. తాజాగా చోటు చేసుకన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకుని నిండు ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో అశోక్-అంకిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. వివాహ అనంతరం ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారు.
ఇకపోతే.. మూడు నెలల కిందట ఈ భార్యాభర్తలకు ఓ అమ్మాయి పుట్టింది. పుట్టిన కూతురుని చూసి ఈ దంపతులు ఎంతో మురిసిపోయారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఈ దంపతులతో పాటు మూడు నెలల చిన్నారితో కలిసి ముగ్గురూ తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక ఆ సమయంలో వారికి ఏం చేయాలో తెలియక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఉన్నట్టుండి ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకుకోవడంతో వారి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.