హైదరాబాద్ రాజేంద్ర నగర్ కొందరు యువకులు గంజాయి మత్తులో రెచ్చిపోయారు. చిన్న పిల్లల గొడవ నుంచి ఇది చివరికి పెద్దలు కొట్టుకునేదాక వెళ్లింది. కత్తులు, కర్రలు, రాళ్లు ఏది దొరికితే వాటితో దాడులకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
రంగారెడ్డి జిల్లాలో కొందరు యువకులు గంజాయి మత్తులో రెచ్చిపోయి ప్రవర్తించారు. ఏకంగా 50 యువకులు ఏకమై అభం, శుభం తెలియని వారిపై దాడులకు పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని బృందావన్ నగర్ కాలనీలో ఇటీవల కొందరు చిన్న పిల్లలు గొడవ పడ్డారు. వారిని విడిపేంచేందుకు వెళ్లిన వారిపై మరి కొందరు యువకులు వారిపై ఇష్టమొచ్చిన రీతిలో దాడులకు దిగారు.
కత్తులు, కర్రలు.. చేతులకు ఏది దొరికితే అవి తీసుకుని నలుగురు వ్యక్తులపై దాడులకు దిగారు. ఏకంగా వారి ఇంట్లోకి వెళ్లి వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అయితే ఈ దాడిలో ఏకంగా 50 మంది యువకుల పాత్ర ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కొందరు కాలనీ వాసులు మాట్లాడుతూ..చిన్న పిల్లల గొడవతో మొదలై చివరికి విచక్షణా రహితంగా కొట్టుకునేదాక వెళ్లిందని, పక్కా ప్లాన్ తోనే ఆ యువకులు దాడులకు దిగారన్నారు.
అంతేకాకుండా మొత్తం 50 యువకులు గంజాయి మత్తులో బీభత్సం సృష్టించారని, ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగావి అన్నారు. వీటిపై పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకుల దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.