ఓ యువకుడు అక్క కూతురిపై మనసుపడ్డాడు. ఆ బాలిక కూడా మామతో ప్రేమలో పడినట్లు సమాచారం. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు మాట్లాడుకున్నారు. కట్ చేస్తే.. చివరికి మామ చేతిలో కోడలు హత్యకు గురైంది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తెలిసి తెలియని వయసులో ప్రేమా, గీమా అంటూ తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువును పక్కనబెట్టి ఎంచక్క సినిమాలు షికారులు తిరుగుతూ చివరికి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు.. ఏకంగా అక్క కూతురినే ఇష్టపడ్డాడు. ఇద్దరూ కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో ఇద్దరినీ మందలించారు. కట్ చేస్తే ఆ యువకుడు మేనకోడలిపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగందంటే?
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం. ఇదే గ్రామానికి చెందిన పద్మ-లక్ష్మయ్య దంపతులు బతుకు దెరువు కోసం గతంలో హైదరాబాద్ కు వచ్చారు. గత కొంత కాలంగా శంషాబాద్ పరిధిలోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు భారతి (16) స్థానికంగా చదువుకునేది. అయితే ఆ బాలిక మేనమామ అయిన విష్ణు (23) భారతిని ఇష్టపడ్డాడు. ఆ బాలిక కూడా అతనితో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. దీంతో ఇద్దరూ గత కొంత కాలం నుంచి ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయం ఇటీవల భారతి ఇంట్లో తెలియంతో లక్ష్మయ్య, పద్మ భార్యాభర్తలు ఇద్దరినీ మందలించి వదిలేశారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు వీళ్లు మాట్లాడుకోవడం లేదు.
ఇకపోతే తన మేనకోడలు భారతి మరో యువకుడితో చనువుగా ఉందని విష్ణు అనుమానించి కోపంతో ఊగిపోయాడు. ఇదిలా ఉంటే.. విష్ణు ఈ నెల 11న భారతికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలని రాళ్లగూడ సర్విసు రోడ్డుకు రమ్మన్నాడు. దీంతో భారతి అతడు చెప్పినట్లే అక్కడికి వెళ్లింది. వెళ్లాక విష్ణు తన మేనకోడలిని బలవంతంగా అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ బాలిక అరుపులు వేయడంతో పక్కనున్న రాయితో విష్ణు భారతి తలపై బలంగా బాదాడు. ఆ యువకుడి దాడిలో ఆ బాలిక అక్కడికక్కడే మరణించింది. చనిపోయిందని తెలుసుకున్న విష్ణు.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదిలా ఉంటే అదే రోజు సాయంత్రం అయినా కూతురు భారతి ఇంటికి రాలేదు.
అటు ఇటు అంతటా వెతికారు. కానీ, ఎక్కడా కూడా ఆ బాలిక ఆచూకి దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియక భారతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని చోట్ల గాలించగా.. రాళ్లగూడ సర్విసు రోడ్డులోని చెట్ల పొదల్లో భారతి మృతదేహం కనిపించింది. పోలీసులు ఈ విషయాన్ని ఆ బాలిక తల్లిండ్రులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు.. కూతురిని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు భారతి ఫోన్ కాల్ డేటా పరిశీలించగా.. మేనమామ విష్ణుతో ఎక్కవసార్లు మాట్లాడినట్లుగా తేల్చారు. కాగా పోలీసులు విష్ణుని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయపెట్టి నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడు విష్ణును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.