ఆమె భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. డాక్టర్ అవ్వాలని మెడిసిన్ చదివింది. అలా రెండేళ్లలో మెడిసిన్ కూడా పూర్తి చేసింది. జీవితం తాను అనుకున్నట్లే ముందుకు సాగుతున్న తరుణంలోనే ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలోని శ్రీరాం కాలనీలో తాడాల శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ప్రత్యూష (19) అనే కూతురు ఉంది. ఆమె డాక్టర్ అవ్వాలని కలలు కనింది. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ కాలేజీలో మెడిసిన్ కోర్సు చదివింది. అలా రెండుళ్ల పాటు కోర్సు పూర్తి చేసిన ప్రత్యూష అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఈ నెల 18న సర్టిఫికెట్స్ తెచ్చుకుంటానని ప్రత్యూష తల్లిదండ్రులకు చెప్పి మహబూబ్ నగర్ వెళ్లింది.
ఇక మరుసటి రోజు ప్రత్యూష తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. కూతురు మాటలు విన్న ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.