Cybercrime: సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలటం లేదు. అవకాశం దొరికితే అందిన కాడికి దోచేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం వీరికి అతీతులు కాదు అనిపిస్తున్నారు. మొన్న సన్ని లియోన్ పాన్ కార్డు ఉపయోగించి రూ.2వేల దాకా లోన్ తీసుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా, బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు పాన్ కార్డు ఉపయోగించి రూ.2500లు లోన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ రావు తన అఫిషియల్ ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ‘‘ నా పాన్ కార్డు దుర్వినియోగించారు. నా పాన్ కార్డు ఉపయోగించి నా పేరు మీద రూ.2500 తీసుకున్నారు. నా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయింది. సిబిల్ అఫిషియల్ దయచేసి సమస్యను పరిష్కరించండి.. ఇందుకోసం కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి’’ అని పేర్కొన్నాడు.
కాగా, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్దిమంది బాలీవుడ్ హీరోల్లో రాజ్‌కుమార్ రావు ఒకరు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించారు. అతికొద్ది కాలంలో ఫేమ్ తెచ్చుకున్నారు. 2010 వచ్చిన ‘లవ్ సెక్స్ ఔర్ దోఖా’తో చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. ఇప్పటివరకు 30 దాకా సినిమాలు చేశారు. తెలుగులో మంచి విజయాన్ని సొంత చేసుకున్న క్రైం థ్రిల్లర్ ‘హిట్’ రీమేక్‌లో నటిస్తున్నారు. మోనిక ఓ మైడార్లింగ్, భీద్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#FraudAlert My pan card has been misused and a small loan of Rs.2500 has been taken on my name. Due to which my cibil score has been affected. @CIBIL_Official please rectify the same and do take precautionary steps against this.
— Rajkummar Rao (@RajkummarRao) April 2, 2022
ఇవి కూడా చదవండి : వదలని RRR ఫీవర్.. ఎనిమిదో రోజు అదే క్రేజు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.