Honeytrap: రేఖ.. ఓ అందమైన మహిళ. ఆమె ఆశలు.. ఆలోచనలు వేరు. మేడల్లో బతకాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, జీవితాన్ని విలాసవంతంగా గడపాలి. ఇది ఆమె కలల జీవితం. కానీ, నిరుపేద భర్త కారణంగా తన కలలు కల్లలుగానే మిగిలాయి. భర్త తన ఆశల్ని తీర్చలేడని నిశ్చయించుకుని, తానే ఓ దారిని వెతుక్కుంది. తన అందాన్ని ఎరగా వేసింది. హనీ ట్రాప్‌తో లక్షలు గడించింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన రేఖ, విక్రమ్ సింగ్ భార్యాభర్తలు. వీరిది నిరుపేద కుటుంబం. ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అయితే, రేఖకు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆశ.
మార్బల్ గోడౌన్‌లో రాళ్లను కత్తిరించే పని చేసే భర్త ఆ ఆశల్ని తీర్చలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆశల్ని తీర్చుకోవటానికి ఓ ప్లాన్ వేసింది. ఇందుకు స్నేహితుడు సైతాన్ సింగ్‌ను కూడా రంగంలోకి దింపింది. మూడేళ్ల క్రితం పరిచయమైన ఓ మార్బల్ వ్యాపారికి తన అందాన్ని ఎరగా వేసింది. మార్బల్ వ్యాపారితో సన్నిహితంగా ఉన్నపుడు స్నేహితుడితో వీడియో తీయించింది. ఆ వీడియో సహాయంతో అతడ్ని బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టింది. అలా దాదాపు రూ. 23 లక్షలు లాగింది. అయినప్పటికి ఆమె ఆశ తీరలేదు.
ఇంకా డబ్బు కావాలంటూ బాధితుడ్ని వేధించసాగింది. ఈ సారి 50 లక్షలు కావాలంది. ఈ నేపథ్యంలో కలత చెందిన వ్యాపారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అంతకంటే ముందు రేఖ విషయాన్ని సోదరికి చెప్పాడు. ఆమె పోలీసులను ఆశ్రయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రేఖపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రేఖ, సైతాన్ సింగ్, భర్త విక్రమ్ సింగ్‌లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భారీగా బయటపడ్డ బ్లాక్ మనీ! గోడలో వెండి ఇటుకలు, 9 కోట్ల డబ్బు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.