Crime News: భార్యకు పిచ్చి పట్టిందంటూ ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను అర్థనగ్నంగా చేసి బాగా కొట్టాడు. అంతటితో ఆగకుండా గొడవను ఆపటానికి వచ్చిన కూతుర్ని కూడా కొట్టాడు. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, జోధాపూర్ జిల్లాలోని ఫలోడి టౌన్‌కు చెందిన కైలాష్ సుతర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు తన భార్యను దారుణంగా కొట్టాడు. విచక్షణా రహితంగా కొడుతూ అర్థన్నంగా చేశాడు. గొడవను ఆపటానికి వచ్చి కూతుర్ని కూడా వదల్లేదు.
ఆమెను కూడా కొట్టాడు. ఆ తర్వాత భార్యను ఎండలో నిలబెట్టాడు. భర్త దెబ్బలు, ఎండవేడి తాళలేక ఆ మహిళ వెక్కివెక్కి ఏడ్చింది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఎలా బయటకు వచ్చిందో తెలీదుకానీ, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో పోలీసుల దృష్టికి పోయింది. ఉన్నతాధికారులు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గుర్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఎందుకలా భార్యను చావకొట్టావని కైలాష్‌ను అడగ్గా.. ‘‘నా భార్య మానసిక స్థితి బాగోలేదు.
ఎక్కడ చూపించినా ఆ పిచ్చి బాగుకాలేదు. దీంతో విసిగి వేసారిపోయాను. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేను ఆమెపై చెయ్యి చేసుకున్నాను’’ అని తెలిపాడు. పోలీసులు తల్లీకూతుళ్లను విరివిగా విచారించారు. కైలాష్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే చేయోచ్చని పేర్కొన్నారు. వారు గనుక ఫిర్యాదు చేస్తే ఇంకో సెక్షన్ కింద అతడిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : జోరుగా నిద్రమత్తులో భర్త.. పక్క రూమ్ లో ప్రియుడితో బరితెగించిన భార్య!