ఈ రోజుల్లో వివాహ బంధాలకు తూట్లు పొడుస్తున్నారు కొందరు పెళ్లైన వ్యక్తులు. పెళ్లైన కొంత కాలం పాటు దంపతులు సంతోషంగానే కాపురాన్ని సాగిస్తున్నారు. ఇక భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు, అనుమనాలు తలెత్తడంతో వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేస్తున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ వివాహిత పెళ్లికాని యువకుడిని ప్రేమించింది. అలా కొన్నాళ్ల పాటు తన చీకటి ప్రమాయణాన్ని సాగిస్తూ వచ్చింది. ఇక ఆ యువకుడు లేకుండా ఉండలేనని ఆ మహిళ ఇటీవల ప్రియుడితో కలిసి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని మోతిసర గ్రామం. ఇక్కడే ఓ మహిళకు పెళ్లై కొంత కాలం పాటు భర్తతో సంసారాన్ని సాగించింది. అలా భర్తతో కాపురాన్ని నెట్టుకొస్తున్న క్రమంలోనే ఆ వివాహిత పొరుగింటి కుర్రాడితో పరిచయం పెంచుకుంది. దీంతో అప్పుడప్పుడు ఆ యువకుడితో మాట్లాడుతూ వచ్చేది. ఇంతటితో ఆగకుండా ఆ మహిళ ఆ యువకుడితో ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని ఆ యువకుడికి చెప్పడంతో అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇంకేముంది.. ఎంచక్కా ఆ మహిళ పెళ్లికాని యువకుడి ప్రేమలో మునిగి తేలింది. అలా కొంత కాలం ఆ వివాహిత భర్తకు తెలియకుండా తన ప్రేమాయణాన్ని సాగిస్తు వచ్చింది.
ఇక రాను రాను ఆ మహిళ ప్రియుడు అంటే ఎంతో ఇష్టం పెరిగి, అతడిని చూడకుండా ఉండలేకపోయింది. దీంతో ఎలాగైన ఆ యువకుడిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి నవంబర్ 14 నుంచి ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడు కనిపించకుండపోయారు. దీంతో అత్తమామలు, భర్త కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయినా కోడలి జాడ మాత్రం లభించలేదు. దీంతో పాటు ఆ యువకుడి తల్లిదండ్రులు సైతం అతడి కోసం అంతటా వెతికినా ఆచూకి దొరకలేదు.
దీంతో వీరిద్దరి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి ఆచూకి కోసం అనేక చోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వీరి జాడ మాత్రం పోలీసులకు కూడా దొరకలేదు. కట్ చేస్తే తాజాగా అదే గ్రామంలో ఓ నీటి బావిలో ఇద్దరు శవాలై కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై మరోసారి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి మరణానికి కారణం మాత్రం తెలియాల్సి ఉంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.