ఆమెకు భర్తంటే ఎంతో నమ్మకం. కన్నవాళ్లని, ఉన్నఊరిని కాదని తాళికట్టిన భర్త వెంట నడిచింది. కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి.. గుండెను రాయిగా మలుచుకుని ఇక నుంచి నాకు అన్నీ భర్తే అనుకుని సంసారాన్ని చేయడం మొదలు పెట్టింది. కట్ చేస్తే.. ఆ మహిళ కాళ్ల పారాణి ఆరకముందే భర్త యుముడిలా మారి కిరాతకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భర్య అన్న కనికరం లేకుండా దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది రాజస్థాన్ అజ్మీర్ జిల్లా క్రిస్టియన్ గంజ్ పరిధిలోని ద్వారకా నగర్. ఇదే ప్రాంతంలో ముఖేష్ సింధీ (34) అనే వ్యక్తి బట్టల వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలానికి ఇతనికి జెన్నిఫర్ (32) అనే మహిళ పరిచయం అయింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారడంతో కొంత కాలం పాటు ఇద్దరు ప్రేమాయణాన్ని కొనసాగించారు. వీరిద్దరి కులాలు వేరైనా సరే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఇటీవల ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో పెళ్లి అయ్యాక ఆ మహిళకు భర్తంటే ఎంతో నమ్మకం పెరిగింది.
కన్నవాళ్లని, ఉన్నఊరిని కాదని తాళికట్టిన భర్తతో అడుగులు వేసింది. కనిపెంచిన తల్లిదండ్రులను వదిలే.. గుండెను రాయిగా మలుచుకుని ఇక నుంచి భర్తే అన్నీ అనుకుని సంసారాన్ని చేయడం మొదలు పెట్టింది. అయితే ఏం జరిగిందో ఏం తెలియదు.. పెళ్లైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా వీరి గొడవల్లో భాగంగా ఇటీవల భార్య జెన్నిఫర్.. నన్ను క్షమించండి.. ఇక నుంచి అలా ఎప్పుడూ చేయని అని భర్తతో వేడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇక మరుసటి రోజు భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. కోపంతో తట్టుకోలేకపోయిన భర్త ముఖేష్ సింధీ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. తన భార్యను దారుణంగా హత్య చేసి శవాన్ని గోనెసంచిలో వేసి పుష్కర్ ప్రాంతంలో పడేశాడు. ఇక విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుున్న పోలీసులు నిందితుడు ముఖేష్ ను అరెస్ట్ చేశారు. అయితే జెన్నిఫర్ సోదరుడు మాత్రం.. కట్నం పేరుతో జెన్నిఫర్ ను ముఖేష్ తరుచు వేధించాడని ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.