ముగ్గురు తోబుట్టువులైన అక్కాచెల్లెళ్లు.. ఒకే ఇంటికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఒకే ఇంటి కోడళ్లుగా మారారు. ఇక భర్త, పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ వారి జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. కట్ చేస్తే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ముగ్గురు మహిళలు నిండు గర్భిణులు కావడం విశేషం. తాజాగా వెలుగు చూసిన ఈ తీవ్ర విషాద ఘటన స్థానికంగా పూడ్చలేని విషాదాన్ని నింపింది. అసలు ఏం జరిగిందంటే.
ఒకే తల్లికి పుట్టిన కాలీ దేవి(27), మమతా దేవి(23), కమ్లేశ్ మీనా అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక ఇంటికి చెందిన నర్సి, గోర్యో, ముకేశ్ వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరికి పదేళ్ల ప్రాయంలోనే పెళ్లిళ్లు చేయడం విశేషం. జీవితంలో పైకి ఎదగాలన్న లక్ష్యంతో మమత పోలీస్ కానిస్టేబుల్ కు ఎంపిక కాగా, కాళీదేవి బీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఇక కమ్లశ్ అనే మహిళ కూడా ఇటీవల కేంద్రీయ విశ్వవిద్యాలమంలో పేరును నమోదు చేసుకున్నారు.వీరికి పెళ్లైన నాటి నుంచి భర్తల నుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సంసారం కదా అని కొన్నాళ్ల పాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఓపికతో వేచి చూశారు. కానీ భర్తలు మాత్రం అవేవి పట్టించుకోకుండా అదనపు కట్నం తేవాలంటూ నరకం చూపించేవారు. ఇక భర్తలు పెద్దగా చదువుకోకపోవడంతో రోజు మద్యానికి అలవాటు పడి తాగొచ్చి వారిపై దాడికి దిగేవారు. ఇక ఇటీవల కాలంలో కూడా ముగ్గురు భర్తల నుంచి వరకట్న వేధింపులు గురి కావడంతో ఆ మహిళలు పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో అక్కడకి వెళ్లాక ముగ్గురు అక్కాచెల్లెళ్లు భర్తలు పెట్టే బాధను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: Singeetham Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు ఇంట తీవ్ర విషాదం!
మృతురాల సోదరుడు.. అదనపు కట్నం కోసం అత్తింటివాళ్లు వాళ్లు తీవ్రంగా వేధించారని, దీని కారణంగా వీరు ఆత్మహత్య చేసుకున్నారంటూ వీరి భర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు భర్తలైన నర్సి, గోర్యో, ముకేశ్ లను అరెస్ట్ విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.