నేటి కాలంలోని కొంతమంది వావివరసలు మరిచి బరితెగిస్తున్నారు. సొంత చెల్లి నుంచి పిల్లనిచ్చిన అత్త వరకు ఇలా ఎవరినీ వదలకుండా వరసలు మరిచి అక్రమ సంబంధాల వలలో చిక్కుకుని ఎంజాయ్ చేస్తున్నారు. తీరా అసలు విషయం బయటకు పొక్కడంతో అవమానం భరించలేక క్షణికావేశంలో నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకున్న ఘటనలోనే ఓ అల్లుడు, అత్త ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్ లోని బార్మర్ జిల్లాలో నివసించే ఓ యువకుడికి ఏడాది క్రితం వివాహమైంది. భార్యాభర్తలు కొత్త కాపురాన్ని మొదలు పెట్టి సంతోషంగా జీవిస్తున్నారు. అయితే వీరుంటున్న ఇంటికి కూతురుని చూసేందుకు అత్తా అప్పుడప్పుడు వస్తుండేది. అలా వస్తున్న క్రమంలోనే అల్లుడి కన్ను అత్తపై పడింది. దీనికి అత్త కూడా సహకరించడంతో ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కలిసి ఇద్దరు బెడ్ రూంలో దూరటం, శారీరక కోరికలు తీర్చుకోవడం వంటివి చేశారు.
అలా కొంత కాలం పాటు వీరి చీకటి కాపురం గుట్టుచప్పుడు కాకుండా ఘనంగా వర్ధిల్లింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం లంగేరా ఫాంటా ప్రాంతానికి సమీపంలో అత్త, అల్లుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.