నేటి కాలంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే సమాజ పోకడపై ఆందోళన కలిగిస్తున్నాయి. చెడు దారుల్లో తిరుగుతున్న కొంతమంది వక్రమార్గంలోకి పయనిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ అడ్డగోలు వివాహేతర సంబంధాలకు కాలుదువ్వుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మేనల్లుడు అత్తను గర్భవతిని చేశాడు. చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యకు విడాకులిచ్చి బై బై చెప్పాడు. ఇటీవల రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: Nalgonda: తాళికట్టిన భర్త కన్నా ప్రియుడే ఎక్కువనుకుంది.. చనువుతో అతనికి దగ్గరై!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ లోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరి వైవాహిక బంధం నలుగురు మెచ్చుకునేలా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల వీరికి వరసకు మేనల్లుడయ్యే వ్యక్తిని ఇంటికి పిలిచారు. అల్లుడు కదా అని సకల మర్యాదలు చేశారు. కానీ మనోడు మాత్రం ఏకంగా అత్తపైనే కన్నేశాడు. అలా మాటా మాటా కలిపి అత్తను తన ముగ్గులోకి దింపాడు. దీంతో అత్త కూడా సై అనడంతో ఇద్దరు ఎంచక్కా ఎంజాయ్ చేశారు.
అలా భర్తకు తెలియకుండా భార్య అల్లుడితో శారీరకంగా కలుసుకుంటుంది. అలా కొంత కాలానికి అత్త గర్భం దాల్చింది. దీంతో ఎక్కడో అనుమానం రావడంతో భర్త భార్యను నిలదీశాడు. అల్లుడే దీనికి కారణమని తెలియడంతో ఏకంగా భార్యకు విడాకులిచ్చి భర్త బై బై చెప్పాడు. తాజాగా రాజస్థాన్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇలా కొందరు వ్యక్తులు వావివరసలు మరిచి మరీ ప్రవర్తిస్తున్నారు. దీంతో వివాహితలు కూడా సై అనడంతో ప్రియుడి మైకంలో పడి నిండు కాపురాలను చేజేలా నాశనం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.