రాజస్థాన్ జోధ్ పూర్ పరిధిలోని కరిసాత్. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తికి స్థానికంగా ఉండే ఓ మహిళతో గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి వైవాహిక జీవితం బాగానే నడిచింది. వివాహమైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఇంత వరకు బాగానే ఉన్నా పెళ్లైన నాటి నుంచి భర్త భార్యను అదనపు కట్నం కింద వేధింపులకు గురి చేసేవాడు. కొన్నాళ్లు ఇవన్నీ మాములే అంటూ భర్య భర్తను వెనకేసుకొచ్చింది. రోజులు మారే కొద్ది భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
కట్నం తేవాలంటూ నిత్యం బెదిరించడం, కొట్టడం చేస్తుండేవాడు. కానీ భార్య మాత్రం తట్టుకుని కాపురాన్ని ద్దిద్దుకుంటూ వస్తుంది. ఇక రాను రాను వరకట్న వేధింపులు మరింత శ్రుతి మించుతున్నాయి. అయితే ఇటీవల ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యను ఇష్టమొచ్చిన రీతిలో దాడికి తెగబడ్డాడు. అలా ప్రతీ రోజు ఆమెపై దాడి చేస్తూ చిత్ర హింసలకు గురి చేసేవారు. మంగళవారం కూడా అదే రీతిలో ప్రవర్తించిన భర్త భార్యను నానా హింసకు గురి చేశాడు.
ఇది కూడా చదవండి: Chennai: మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయింది.. కానీ ఆ ఒక్క భయంతోనే తట్టుకోలేకపోయింది!
భర్త చేసిన ఈ దాడిలో భాగంగానే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇరుగు పొరుగు వాళ్లు ఈ సమాచారం ఆ మహిళ తల్లిదండ్రులకు చేరవేశారు. ఆ మహిళ తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కూతురును చూసి శోక సంద్రంలో మునిగిపోయారు. నా కూతురి హత్యకు భర్త, అత్తింటివాళ్లే కారణమంటూ వాపోయి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.