నేటి కాలంలో కొందరు అమ్మాయిలు ప్రేమ పేరుతో యువకులను నట్టేట్ట ముంచుతున్నారు. అచ్చం ఇలాగే ఓ యువతి ప్రేమ పేరుతో ఒకరికి తెలియకుండా మరొకరిని తన ముగ్గులోకి దింపుకుని ఎంజాయ్ చేసేది. అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో యువతి మోసం చేసిందని ఇద్దరు యువకులు తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు ప్రేమికులు తర్వాత ఏం చేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్. ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీంతో యువకుడి ప్రేమకు స్వాగతం పలికిన ఆ యువతి అతనితో ప్రేమలో పడింది. ఇక కొన్నాళ్ల పాటు ఈ జంట ప్రేమ విహారంలో తేలియాడారు. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి తన ప్రియుడికి తెలియకుండా మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి తన ముగ్గులోకి దింపుకుని ఎంజాయ్ చేసేది. ఇక కొన్నాళ్లకి యువతి చేస్తున్న ఈ మోసాన్ని ఎట్టకేలకు ఓ యువకుడు గ్రహించాడు.
ఇది కూడా చదవండి: పిల్లలు కాలేదని మేనల్లుడిని బలవంతం పెట్టిన అత్త.. సడెన్ గా మామ ఎంట్రీ ఇవ్వడంతో!
నన్ను కాదని మరొకరితో ప్రేమలో పడిందని తెలుసుకున్నాడు. దీంతో తన ప్రియురాలిని ప్రేమిస్తున్న మరో యువకుడి అడ్రస్ ను తెలుసుకుని అతని వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఈ లవ్ స్టోరి చివరికి పోలీసుల వరకు వెళ్లింది. ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.