పైన కనిపిస్తున్న వీళ్లిద్దరూ దంపతులు. గతంలో వివాహమై ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే భర్త ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి చేస్తున్న ఈ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలుసుకున్నాడు. కానీ, ఇక్కడ వారు ఓ కండీషన్ పెట్టినట్లు తోటి ఉద్యోగుల నుంచి తెలుసుకున్నాడు. ముగ్గురు పిల్లల సంతానం ఉంటే ఉద్యోగం రెగ్యులర్ కాదని, ఉద్యోగం కూడా పోతుందని తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.
రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో జవార్ లాల్ మేఘ్వాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. జవార్ లాల్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెళ్లైన కొంత కాలం తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే 5 నెలల కిందట జవార్ లాల్ దంపతులకు మరో కూతురు కూడా జన్మించింది. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ గా చేస్తున్న జవార్ లాల్ ఉద్యోగం త్వరలో రెగ్యులర్ అవుతుందని తెలుసుకున్నాడు. కానీ, తోటి ఉద్యోగులు మాత్రం… ముగ్గురు సంతానం ఉంటే ఉద్యోగం పోతుందని చెప్పారు. వీరి మాటలు ఉన్న జవార్ లాల్ భయంతో వణికిపోయాడు.
ఈ క్రమంలోనే అతనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక బాగా ఆలోచించిన జవార్ లాల్ కు ఓ ఆలోచన వచ్చింది. అదే.. తన 5 నెలల కూతురిని చంపడం. అనుకున్నదే ఆలస్యం.. జవార్ లాల్ తన భార్యతో కలిసి ఉద్యోగం కోసం 5 నెలల చిన్నారిని స్థానికంగా ఉన్న ఓ కాలువలో పడేసి చేతులు దులుపుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం మెల్లగా పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడు జవార్ లాల్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఉద్యోగం కోసం కన్న కూతురుని చంపిన తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.