వివాహేతర సంబంధం… ఇదే పచ్చని సంసారంలో నిప్పులు పోస్తుంది. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ నిండు సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక కొందరు మహిళలు పడక సుఖానికి అడ్డుగా ఉన్న కట్టుకున్న భర్తను, కన్న పిల్లలను కూడా కాటికి పంపేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు ప్రియుడితో సుఖం కోసం అడ్డుగా ఉన్న తన మూడేళ్ల కూతురిని దారుణంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
రాజస్థాన్ శ్రీగంగానగర్ పరిధిలోని శాస్త్రీ నగర్ లో సునీత అనే మహిళ నివాసం ఉండేది. గతంలో ఈ మహిళకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలానికి ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలను సాదుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. ఇదిలా ఉంటే గతంలో భార్యాభర్తల విభేదాల కారణంగా సునీతో భర్తతో విడిపోయి సన్నీ అనే వ్యక్తితో కాపురం పెట్టింది. అయితే ముగ్గురు పిల్లలు భర్తతో ఉండగా, మరో ఇద్దరు పిల్లలను మాత్రం సునీత చూసుకుంటుంది. దీంతో సునీత ప్రియుడితో ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ సునీత ప్రియుడితో పడక సుఖానికి తన మూడేళ్ల కూతురు అడ్డుగా ఉండడంతో చంపాలని అనుకుంది.
ఇందులో భాగంగానే సునీత ఇటీవల తన ప్రియుడితో చేతులు కలిపి కన్న కూతురిని దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆ బాలిక శవాన్ని ఓ బ్యాగులో మూటగట్టి సునీత ప్రియుడితో కలిసి శ్రీగంగానగర్ రైల్వే స్టేషన్ లో రైలెక్కింది. ఇక ఆ రైలు ఫతుహి రైల్వే స్టేషన్ చేరుకోగానే తమ వద్ద ఆ బాలిక శవాన్ని పక్కనున్న కాలువలో పడేద్దామని అనుకున్నారు. కానీ ఆ బాలిక శవం కాలువలో పడకుండా రైలు పట్టాలపై పడింది. స్థానికుల సమాచారం మేరకు ఆ బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. చివరికి ఆ చిన్నారిని చంపింది కన్న తల్లేనని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితులైన తల్లి సునీత, ఆమె ప్రియుడు సున్నీని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడితో పడక సుఖానికి అడ్డుగా ఉన్న కూతురిని చంపిన ఈ కసాయి తల్లి దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.