ఆమెకు అప్పటికే పెళ్లైంది. అయినా సరే.. భర్తను కాదని స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో తెరచాటు సంసారాన్ని నడిపించింది. కట్ చేస్తే.. చివరికి అదే ప్రియుడు ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు.
ఈ మధ్య కాలంలో ఊహించని దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పెళ్లైనా కొందరు మహిళలు భర్తలను కాదని మరొకడితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీనితో సరిపెట్టకుండా.. ప్రియుడితో తిరుగుతు చివరికి అతడి చేతిల్లోనే ప్రాణాలు కోల్పుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ నాగౌర్ జిల్లా శ్రీ బాలాజి పరిధిలోని బాలాసర్ గ్రామం. ఇక్కడే గుడ్డి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఇకపోతే ఆ మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా సమాచారం. గత కొంత కాలం నుంచి ఆ మహిళ ప్రియుడితో తెర వెనుక సంసారాన్ని నడిపించింది. అయితే ఇటీవల పుట్టించి వెళ్లిన ఆ మహిళ.. ఈ నెల 20న పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లున్నానని ఇంట్లో చెప్పి వచ్చింది.
అదే రోజు సాయంత్రం ఆ మహిళ అత్తింటికి చేరుకోలేదు. దీంతో ఖంగారుపడ్డ ఆ మహిళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాల్లో వెతికారు. ఎంత వెతికినా.. గుడ్డి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక ఆ మహిళ కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. ఈ క్రమంలోనే పోలీసులకు ఆమె ప్రియుడి గురించి తెలిసింది.
దీంతో అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట్లో తనకేం సంబంధం లేదంటూ ఆ వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక పోలీసులకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో అతడినే గట్టిగా విచారించే సరికి ఆ వ్యక్తి సంచలన నిజాలు వెల్లగక్కాడు. నాకు, గుడ్డికి మధ్య గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల మా మధ్య గొడవలు రావడంతో ఆమెను నమ్మించి నరికి చంపానని తెలిపాడు.
ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి ఓ బావిలో పడేసినట్లుగా ఒప్పుకున్నాడు. అతడు చెప్పిన మాటలు విన్న గుడ్డి తల్లిదండ్రులు, అత్తింటి వారు షాక్ గురయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించి ఆమె డెడ్ బాడీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.