ఆమెకు భర్త కన్నా ప్రియుడే ముఖ్యం. భర్తపై నకిలీ ప్రేమను ఒలకబోస్తూ ప్రియడితో ఎంజాయ్ చేసేది. అయితే ఇటీవల భర్తకు అసలు విసయం తెలియడంతో భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక రూట్ మార్చిన ఆ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ప్లాన్ గీసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆమెకు అప్పటికే పెళ్లైంది. మొగుడితో ఎంచక్కా సంసారం చేయకుండా పక్కచూపులు చూసింది. అంతేకాకుండా పరాయి మగాడితో పరిచయం పెంచుకుని చివరికి బెడ్ షేర్ చేసుకుంది. అలా భర్త కళ్లు గప్పి ఈ కిలాడీ లేడి వివాహేతర సంబంధాన్ని నడిపించింది. కొన్నాళ్ల పాటు మొగుడికి తెలియకుండా ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గా నడిపిస్తూ వచ్చింది. కట్ చేస్తే.. భార్య రంకుపురాణం ఎట్టకేలకు భర్తకు తెలిసింది. దీంతో భార్యకు భర్త వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఆ భార్య ప్లాన్ చేంజ్ చేసి ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ జైపూర్ పరిధిలోని రంగునీతా గ్రామం. ఇక్కడే జుడాన్ మహా, ఉత్తర దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. కొంత కాలం పాటు దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్నేళ్ల తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే రాను రాను ఉత్తరదేవి పక్కచూపులు చూసింది. విషయం ఏంటంటే? కట్టుకున్న మొగుడిని కాదని ఆ వివాహిత షిలాపూర్ గ్రామానికి చెందిన క్షేత్రపాల్ తో అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. భర్త కళ్లు గప్పి ఉత్తరదేవి ప్రియుడితో సరసాలు కొనసాగించింది. ఇదిలా ఉంటే భార్య రంకుపురాణం ఇటీవల భర్తకు తెలిసింది.
కోపంతో ఊగిపోయిన జుడాన్.. బుద్దిమార్చుకోవాలంటూ ఉత్తరదేవికి వార్నింగ్ ఇచ్చాడు. తీరు మార్చుకోని ఆ మహిళ భర్తపై ఒక్కసారిగా ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది. ప్రియుడితో గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని ఆ కిలాడీ లేడి ఎలాగైనా సరే మొగుడుని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. అయితే ఇదే విషయాన్ని ప్రియుడికి వివరించించగా అతను కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పథకం ప్రకారమే ఇటీవల జుడాన్ ను ఉత్తరదేవి ఆమె ప్రియుడు క్షేత్రపాల్ రాళ్లతో కట్టి చంపారు. అనంతరం ఇద్దరు కలిసి జుడాన్ మర్మంగాలను కట్ చేసి చేసి శవాన్ని ఇంటి అవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పడేసి చేతులు దులుపుకున్నారు.
ఇక మరుసటి రోజు నుంచి నా భర్త కనిపించడం లేదంటూ ఉత్తర దేవి మొసలి కన్నీరు కార్చింది. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో భాగంగా పోలీసుల ముందుగా జుడాన్ భార్య ఉత్తర దేవిని ప్రశ్నించగా ఆమె సంచలన నిజాలు బయటపెట్టింది. ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని, దీని కారణంగా హత్య చేశామని నేరాన్ని అంగీకరించింది. నిందితురాలి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు సెప్టిక్ ట్యాంక్ నుంచి జుడాన్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడితో గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.