మనం అప్పుడప్పుడు చేసే కొన్ని నిర్లక్ష్యపు పనుల వల్ల అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాగే ఓ భర్త నిర్లక్ష్యానికి అతని భార్య బలైంది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
కొన్ని అనుకోని ప్రమాదాల వల్ల చివరికి ఊహించని విషాదాలు చోటు చేసుకుంటుంటాయి. కొంతమంది నిర్లక్ష్యంగా చేసే పనులకు ఎదుటి వారికి హాని కలగడంతో పాటు చివరికి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో చూశాం. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఇష్టం వచ్చినట్లు ర్యాష్ గా వాహనాలు పడపడ కారణంగా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పుతుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ భర్త చేసిన నిర్లక్ష్యపు పనికి భార్య నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. రాజస్థాన్ లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని గొత్డా గ్రామం. ఇక్కడే భగవత్ సింగ్- దుర్గా కన్వర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. భర్త పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వస్తున్నాడు. దీంతో వాళ్ల కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. ఇకపోతే తాజాగా భగవత్ సింగ్ ఇంట్లో తన తుపాకీ శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో అతని భార్య ఎదురుగా కూర్చుంది. కాగా, ప్రమాదవశాత్తు భర్త భగవత్ సింగ్ ట్రిగ్గర్ పై నొక్కాడు. దీంతో అక్కడే ఉన్న భార్య దుర్గా కన్వర్ ఎదలోకి బుల్లెట్ దూసుకెళ్లిపోయింది. ఇక చూస్తుండగానే భార్య రక్తపు మడుగులో కిందపడిపోయింది. వెంటనే గమనించిన భర్త.. హుటాహుటిన భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించాడు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని నిర్ధారించారు. భార్య మృతిలో భర్తతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం భర్త భగవత్ సింగ్ జరిగిందంతా పోలీసులకు వివరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. భర్త చేసిన నిర్లక్ష్యపు పనికి భార్య నిండు ప్రాణం గాలిలో కలిసి పోయిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.