దేశంలో కామాంధుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. వారి కామవాంక్షకు బయపడి మహిళల మృతదేహాలను పాతిపెట్టాలంటేనే భయపడాల్సిన రోజులొచ్చాయి. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే అందుకు నిదర్శనం.
సమాజంలో జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే దేశం ఎటువెళ్తుందో తెలియడం లేదు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు కాల్చుకుతింటున్న కామాంధులు, పూడ్చిపెట్టిన వారిని సైతం వదలడం లేదు. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే అందుకు నిదర్శనం. మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు.. ఇంటికి వెళ్లిన కాసేపటికే దారుణం చోటు చేసుకుంది. పూడ్డిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటికి తీసిన కొందరు వ్యక్తులు, మరీ నీచంగా ఆ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వివరాలు..
రాజస్థాన్, సికార్ జిల్లా పరిధిలోని అజిత్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. పోస్టుమార్టం అనంతరం పోలీసులు.. సదరు మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆపై కుటుంబ సభ్యులు మంగళవారం మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తాంత్రిక పూజల పేరుతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. ఆపై అమానవీయంగా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డారు.
శ్మశానంలో అలికిడి వస్తుండడంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా వీరి బాగోతం బయటపడింది. వెంటనే పెద్ద పెద్ద అరుపులతో గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో.. అందరూ కలిసి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లు.. తాంత్రిక పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు స్థానిక ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అని చెప్తున్నారు.తాగిన మత్తులో ఇలా ప్రవర్తించారా..? లేదా శరీర భాగాలను ఛిద్రం చేయాలన్న ఆలోచన ఉందా.? అన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.