పెళ్లింట పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పనుల్లో పడి.. ఓ చిన్న విషయాన్ని పట్టించుకోకపోవడంతో.. ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఆ వివరాలు..
ఇంట్లో పెళ్లి అంటే ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లికి వారం, పది రోజుల ముందు నుంచి ఇంటికి బంధువుల రాకపోకలు మొదలవుతాయి. పెళ్లి పనులతో ఇళ్లంతా హడావుడిగా ఉంటుంది. ఇక పెళ్లి రోజు ఉండే హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లి ఇంట్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. పచ్చని తోరణాలు, మేళతాళ ధ్వనులు, నూతన దంపతులను ఆశీర్వదించడానికి తరలి వచ్చిన బంధుగణంతో.. ఇల్లంతా కళకళ్లాడుతుంది. మరో 24 గంటల్లో పెళ్లి తంతు ప్రారంభం కానుంది. వివాహానికి ముందు బరాత్ వేడుక జరుగుతుంది. దాని కోసం పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో పెళ్లి ఇంట ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో అంతసేపు ఎంతో సందడిగా ఉన్న పెళ్లి ఇల్లు శవాల దిబ్బగా మారింది. పెళ్లి హడావుడిలో పడి నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చోటు చేసుకున్న ప్రమాదం.. ఏడుగురిని బలి తీసుకుంది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. భుంగ్రా అనే గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక అక్కడ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు బరాత్ నిర్వహిస్తారు. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, యువత.. బరాత్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. పెళ్లి పనుల హడావుడిలో పడి.. ఓ విషయం మర్చి పోయారు. గ్యాస్ సిలిండర్‌ను ఒక దాన్ని స్టోర్ రూమ్‌లో ఉంచారు. కానీ దాన్ని సరిగా క్లోజ్ చేయడంతో.. అది లీకవుతోంది. అయితే పెళ్లింట్లో ఎవరూ దాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
పెళ్లిక వచ్చిన వారంతా బరాత్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ శబ్ధంతో సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఇల్లంతా కూలిపోయింది. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు పేలుడు ధాటికి ఎగిరి పడ్డారు. మంటలు చెలరేగడంతో ఏకంగా ఏడుగురు సజీవదహనం చెందారు. ఈ ప్రమాదంలో 60 మందికి పై గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, నాగౌర్ ఎంపీ హనిమాన్ బెనివాల్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ హిమాన్షు గుప్తా మాట్లాడుతూ.. ‘ఇది ఘోర సంఘటన. 60 మంది గాయపడ్డారు. వారిలో 42 మందిని ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. వైద్య సదుపాయం అందిస్తున్నాం’ అని తెలిపారు. పెళ్లి ఇంట ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉంటే.. ఇంతటి పెను ప్రమాదం తప్పేది కదా అంటున్నారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.