Crime News : 15 వేల రూపాయల కోసం ఓ వృద్ధ జంటను అతి దారుణంగా నరికి చంపారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. స్థానిక జనం హడలిపోయేలా ఈ రెండు హత్యలు చేశారు. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌లోని దుంగార్‌పుర్ జిల్లా సగ్‌వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని సురాజ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల శావ్జి దోడియా, మన్ దోడియా భార్యభర్తలు. అదే గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సంరక్షకులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం వారి కూతురు బాబ్లీ తల్లిదండ్రుల్ని కలిసేందుకు అక్కడికి వెళ్లింది. వ్యవసాయ క్షేత్రం ముందు ద్వారం వేసి ఉండటంతో వెనక వైపునుంచి వెళ్లింది.
అక్కడ రూము తలుపు తెరిచి కనిపించింది. దీంతో లోపలికి వెళ్లింది. అక్కడి దృశ్యాలు చూసి ఆమె షాక్ తింది. తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారి శరీరం మొత్తం కత్తితో విచక్షణా రహితంగా నరికినట్లు ఉంది. ఆమె వెంటనే సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు బంధువులు, గ్రామస్తులతో అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘనటా స్థలాన్ని పరిశీలించారు. పదునైన ఆయుధాలతో వారిని హత్య చేసినట్లు గుర్తించారు. అక్కడి గోడల మీద కూడా రక్తపు మరకలు ఉండటం గమనించారు. తన తండ్రి దగ్గర ఉండాల్సిన 15 వేల రూపాయలు కనిపించటం లేదని మృతుల కుమారుడు పోలీసులకు తెలిపాడు. అంతేకాదు! తల్లి కాలికి ఉండాల్సిన మెట్టెలు కూడా లేవని అన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నా వల్ల కావట్లేదు.. చాలా టార్చర్ అనుభవిస్తున్నా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.