ఈ మద్య మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి.. ఆస్తి కోసం కోసం సొంతవారిని సైతం కడతేర్చేందుకు వెనుకాముందు ఆడటం లేదు. కొంత మంది మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. కేవలం వంద రూపాయల కోసం కన్నతండ్రిని కొట్టి చంపిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని లసోడియా గ్రామంలో సందేశ్ అనే యువకుడు మద్యానికి బానిక అయ్యాడు. కూలీకి వెళ్తూ వచ్చిన డబ్బు మొత్తం మద్యానికి, తిరుగుళ్లకు ఖర్చుపెట్టేవాడు. ఈ క్రమంలో తన తండ్రి నానూ పై రాయి పడి వెంటనే మరణించాడని సజ్జన్ ఘడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. పోస్ట్ మార్టంలో పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడిని ఎవరో కావాలని తీవ్రంగా కొట్టినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి.
ఈ కోణంలో పోలీసులు విచారణ జరపగా.. చనిపోయిన నానూ పెద్ద కుమారుడు తన సోదరుడు సందేశ్ ఈ హత్య చేశాడని ఒప్పుకున్నాడు. వంద రూపాయల విషయంలో తండ్రీ కొడుకుల మద్య వివాదం చెలరేగి కర్రతో తండ్రిని దారుణంగా కొట్టడంతో అతడు మరణించినట్లు పెద్ద కొడుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో సందేశ్ ని విచారించగా తన తప్పును ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది చదవండి: నా వల్ల కావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!