నేటి కాలం యువత తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, పైగా తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహాలు చేసుకోవడం చేస్తున్నారు. ఇక కొన్నాళ్ల తర్వాత ప్రియుడి అసలు రూపం బయటపడడంతో మోసపోయానని గ్రహించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్తాన్ లో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు చెందిన రీనా అనే యువతి రాజస్థాన్ లోని కోట నగరానికి చెందిన కరణ్ సింగ్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ జంట ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆ యువతి పెద్దలను ఎదురించి పారిపోయి ప్రియుడితో పెళ్లి చేసుకుంది.
ఇది కూడా చదవండి: West Bengal: మహిళ చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు గంటల పాటు నరకం!
పెళ్లైన నాలుగు ఏళ్లపాటు వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత భర్త కరణ్ సింగ్ భార్యను అదనపు కట్నం కింద వేధింపులకు గురి చేశాడు. భర్త వేధింపులను కొంత కాలం భరించిన ఆ మహిళ వేధింపులు ఎక్కువవ్వడంతో తట్టుకోలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే కరణ్ సింగ్ పూజ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో అప్పటి నుంచి భార్యతో సరిగ్గా ఉండడం కూడా చేసేవాడు కాదు. వీటన్నిటిని రీనా భరించలేక తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఏం చేయాలో తెలియక రీనా శుక్రవారం నా మరణానికి నా భర్త, అతని ప్రియురాలు పూజనే కారణమంటూ ఓ వాట్సాప్ ఆడియోను తన సోదరుడికి పంపి అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ కుటుంభికులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే రీనా తల్లిదండ్రులు భర్త కరణ్ సింగ్, అతని ప్రియురాలు పూజపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.