అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన బొజ్జ అనూష (23) పోతర్ల మహిపాల్ ఇద్దరు భార్యాభర్తలు. వీరు ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
అయితే కుటుంబ అవసరాల కోసం వీరు గతంలో రూ.5 లక్షల వరకు అప్పలు చేశారు. వీటిని తీర్చేందుకు భర్త మహిపాల్ ఇటీవల గల్ఫ్ కు వెళ్లాడు. ఇక ఈ క్రమంలో ఇచ్చిన అప్పులు తీర్చాలంటూ అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఇంటికి వచ్చేవారు. దీంతో అత్తమామలు ఇంటి వద్దే ఉంటున్న కోడలిపై కోపం పెంచుకున్నారు. చేసిన అప్పలు తీర్చాలంటూ భర్తతో పాటు అత్తామామలు కోడలిని రోజూ మానసికంగా వేధింపులకు గురి చేసేవారు.
ఇది కూడా చదవండి: Bride Srujana: విశాఖ వధువు కేసులో కొత్త ట్విస్ట్! సృజన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు!దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనుష తన ఇద్దరు పిల్లలతో పాటు కలిసి స్థానికంగా ఓ బావిలో దూకి ఆత్యహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న అనుష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.