నా భర్త చనిపోయాడు.. ఇక తనకు ఈ తాళి బొట్టు అక్కర్లేదంటూ ఓ మహిళ ఆగ్రహంతో సీఐపైనే మంగళ సూత్రాన్ని విసిరేసింది. బంధువుల ఆందోళనలతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో వెంటనే స్పందించిన డీఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐపేనే ఆ మహిళ తాళిబొట్టు విసిరేయడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. జిల్లాలోని రుద్రంగి ప్రాంతంలో నెపూరి నర్సయ్యకు కిషన్ అనే వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఇక ఇంతటితో ఆగకుండా నేపూరి నర్సయ్యపై ప్రత్యర్థి వ్యక్తి కిషన్ పగ పెంచుకున్నాడు. ఎలాగైన ఇతనిని అంతమొందించాలనే ప్రయత్నాలు చేశాడు. ఇందులో భాగంగా అతనిని హత్య చేసుకుందుకు కిషన్ సమయం కోసం ఎదురుచూశాడు. దీంతో కాపుకాసిన కిషన్ నర్సయ్య రాకను గమనించి ఇటీవల ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేశాడు. అనంతరం నర్సయ్య మరణానికి కిషన్ అని వ్యక్తి కారణమని నర్సయ్య బంధువులు తెలుసుకున్నారు. ఇక కిషన్ పోలీసుల అదుపులో ఉన్నాడని తెలుసుకున్న నర్సయ్య బంధువులు ఆగ్రహంతో రుద్రంగి పోలీసు స్టేషన్ పై దాడికి దిగారు.
ఇది కూడా చదవండి: సీక్రెట్ గా వివాహేతర సంబంధాల్లో భార్యాభర్తలు! భర్త ప్రియురాలిని మచ్చిక చేసుకుని భార్య ఏం చేసిందో తెలుసా?
నర్సయ్య హత్యకు స్థానిక సీఐ వల్లే ఈ హత్య జరిగిందంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. నా భర్త చనిపోయాడు.. ఇక నాకు ఈ తాళి బొట్టు అక్కర్లేదంటూ నర్సయ్య భార్య ఆగ్రహంతో సీఐపైనే మంగళ సూత్రాన్ని విసిరేసింది. దీంతో రుద్రంగి స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన వేములవాడ డీఎస్పీ ఇరు వర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.