ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు డబ్బులను ఈజీగా ఎలా సంపాదించాలనే మార్గాలను వెతుకుతున్నారు. అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన కొందరు కేటుగాళ్లు.. జ్యోతిష్యం చెబుతామంటూ అమాయక ప్రజలను మోసం చేసి చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో పగటి వేషగాళ్లు ఎక్కువైపోతున్నారు. అచ్చం ఇలాగే పథకం వేసిన కొందరు కేటుగాళ్లు.. జాతకాలు చూస్తాం, జ్యోతిష్యం చేబుతామంటూ అమాయక జనాన్ని నిండా ముంచేస్తున్నారు. ఇలా ఎంతో మందిని మోసం చేస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జ్యోతిష్యం పేరుతో ఈ కేటుగాళ్లు చేసిన మోసం ఏంటి? అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన గిత్త శివకుమార్, ఎర్నాల సారయ్య అనే వ్యక్తులు డబ్బులు ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలను వెతికారు.
అందుకోసం నకిలీ జ్యోతిష్యులుగా అవతారమెత్తారు. ఇక వీరి వద్ద ఉన్న ఓ కారులో ఊళ్లన్ని తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. మీకు చాలా సమస్యలు ఉన్నాయని, ఎవరో చేతబడి చేయడం కారణంగానే మీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నమ్మిస్తారు. మెల్లగా వారి ఇంటికి వెళ్లి ఎన్నో మాయమాటలు చెబుతున్నారు. ఆ తర్వాత పూజలు చేయాలంటూ కుంకుమ, పసుపులతో రాసి అమాయక ప్రజలను ఆ మైకంలోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత కొంత డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ కేటుగాళ్లు ఇప్పటికీ ఇలా ఎంతోమంది అమాయకులను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న SOT పోలీసులు తాజాగా వారిని ఓ చోట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారి నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రూ 84 వేల నగదు, మరికొన్ని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.