ఈ మధ్యకాలంలో పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలు తరచూ వస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి పిల్లలను అక్రమంగా రాష్ట్రాలను దాటించేస్తున్నారు. అంతేకాక అక్రమంగా తరలించిన పిల్లలను వివిధ రకాల పనుల్లో చేర్చి.. వారికి నరకం చూపిస్తున్నారు. తాజాగా మరో భారీ మానవ అక్రమ రవాణ బయటపడింది.
ఈ మధ్యకాలంలో పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలు తరచూ వస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి పిల్లలను అక్రమంగా రాష్ట్రాలను దాటించేస్తున్నారు. అంతేకాక అక్రమంగా తరలించిన పిల్లలను వివిధ రకాల పనుల్లో చేర్చి.. వారికి నరకం చూపిస్తున్నారు. బాలల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఈ ముఠా ఆగడాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే అనేక సార్లు పోలీసులు.. పిల్లలను అక్రమంగా తరలిస్తున్న ముఠాల పట్టుకున్నారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల్ 25 మంది పిల్లలను రైల్వే పోలీసులు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 25 మంది పిల్లలను చూసి రక్షించారు. ఇలా పిల్లలను అక్రమంగా తరలిస్తున్న నిందితుల్లో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇక ఇతర రాష్ట్రాల తీసుకొచ్చిన 12 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలను నగరంలోని చిన్న చిన్న తరహా పరిశ్రమల్లో పనులు చేయిస్తారని తెలిసింది. ఆపరేషన్ యాక్షన్ ఎగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ లో భాగంగ సికింద్రాబాద్ రైల్వే సిబ్బంది, ఒక ఎన్జీవో సహాకారంతో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న పిల్లలను కాపాడారు.
మళ్లీ అలాగే ఆర్పీఎఫ్ విజయవాడ, వరంగల్ స్టేషన్ ల దగ్గర కూడా తనిఖీలు నిర్వహించి పిల్లలను రక్షించారని అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పిల్లలను హన్మకొండలోని బాలల గృహంలో ఆశ్రయం కల్పించారు. మే 2022లో బీబీఏ, బీఆర్ఎఫ్ ఉమ్మడి లక్ష్యంతో అవగాహన ఒప్పందం పై సంతకం చేసుకొన్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి సమాచారాన్ని పంచుకోవడంతో పాటు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేయడానికి కృషి చేయనున్నాయి. ఏటా కూడా వేలాది మంది మహిళలు, పిల్లలను అక్రమంగా తీసుకెళ్లడానికి ముఠాలు ఎక్కువగా రైళ్లనే ఉపయోగిస్తున్నారు. అందుకే అధికారులు కూడా రైళ్లలో ఎప్పడికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బాలల రక్షణకు అవసరమైన చట్టాలు ఉన్నప్పటికి కూడా ఇలాంటి రకరకాలైన దోపిడిలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమాజంలో తీవ్రమైన ఇలాంటి నేరాలు అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం అక్రమ రవాణా నిరోధక బిల్లును వీలైనంత త్వరగా ప్రవేశపెట్టాలని, అలానే అతి త్వరలో వాటిని అమలులోకి తీసుకురావాలని బచ్‌పన్ బచావో ఆందోళన్ డైరెక్టర్ మనీష్ శర్మ కోరారు. ఇలాంటి మానవ అక్రమ రవాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు స్పష్టం చేశారు. అలానే చిన్న పిల్లలను ఎవరూ కూడా పనిలో పెట్టుకోవద్దని సూచించారు. మరి.. పిల్లల మానవ అక్రమ రవాణను అరికట్టేందుకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.