పైన ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు శిరీష. ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ ఓ బాలిక ఈ నెల 12వ తేదీ నుంచి కనిపించకుండాపోయింది. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత 11 రోజుల నుంచి కూతురి ఆచూకి దొరకకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దుర్గా భవానీ నగర్ లో కృష్ణ-సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు నరేష్, కూతురు శిరీష (12) సంతానం. అయితే వీరి కూతురు స్థానికంగా ఉండే రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 12వ తేదీ నుంచి శిరీష కనిపించడం లేదు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, కూతురి జాడ మాత్రం దొరకలేదు. దీంతో వారి బంధువులకు ఫోన్ చేసి కూతురి జాడ గురించి తెలుసుకున్నారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. శిరీష ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసకు మేనల్లుడు మల్లేష్ (22) అనే వ్యక్తి నా కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడనే అనుమానం ఉందని, మా కూతురిని రక్షించండి అంటూ శిరీష తల్లిదండ్రులు పోలీసుల ఎదుట వేడుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైనా శిరీష ఆచూకి కనిపిస్తే.. 8712660458 ఈ నెంబర్ కు కాల్ చేయాలని పోలీసులు కోరారు. అయితే ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ బాలిక మిస్సింగ్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.